విజయనగరం: ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ ముంద ఆందోళనకు దిగిన విద్యార్ధులపై  గురువారం నాడు పోలీసులు లాఠీచార్జీకి దిగారు.

పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని  విద్యార్ధులు ఇవాళ కలెక్టరేట్ ముందు బైఠాయించారు. అంతేకాదు విశాఖపట్టణం రాయపూర్ జాతీయ రహదారిని  కూడ దిగ్భంధించారు.

దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆందోళన చేస్తున్న విద్యార్ధులకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ తమ డిమాండ్లపై  స్పష్టత వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్ధులు చెప్పారు. దీంతో విద్యార్ధులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు.