Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కు కరోనా

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి హైదరాబాదు నివాసం వద్ద బందోబస్తు డ్యూటీ చేసిన కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకింది. బాపట్లకు చెందిన కానిస్టేబుల్ కు పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది.

Police constable in Chandrababu's security duty in infected with Coronavirus
Author
Bapatla, First Published Jun 14, 2020, 8:36 AM IST

గుంటూరు: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకింది. హైదరాబాదులోని చంద్రబాబు నివాసం అతను ఇటీవల విధులు నిర్వహించాడు. హైదరాబాదులోని చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించి గుంటూరు జిల్లా బాపట్లకు వచ్చాడు. 

అతను బాపట్ల పట్టణ పోలీసు స్టేషన్ లో పనిచేస్తు్ననాడు. మే 5వ తేదీన డ్యూటీపై అతను హైదరాబాదు వెళ్లి ఈ నెల 7వ తేదీన వచ్చాడు. కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించారు. శనివారం వచ్చిన ఫలితాల్లో అతనికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాదులోని తోటి కానిస్టేబుల్ నుంచి అతనికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 200కు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 222 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5858కి చేరుకుంది. 

గత 24 గంటల్లో ఏపీకి చెందినవారిలో 186 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 33 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ యింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 5858కి చేరుకుంది. 

కాగా, గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఇద్దరు మరణించారు. ఈ రెండు మరణాలు కూడా కృష్ణా జిల్లాలో సంభవించాయి. దీంతో కరోనా వైరస్ తో రాష్ట్రంలో మరణించినవారి సంఖ్య 82కు చేరుకుంది. గత 24 గంటల్లో 14,477 శాంపిల్స్ ను పరీక్షించారు. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 2641 మంది డిశ్చార్జ్ కాగా, 1865 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో 202 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. గత 24 గంటల్లో ఒకరు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 180 ఉంది. 

ఇదిలావుంటే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1068 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. గత 24 గంటల్లో 51 మంది కోవిడ్ -19 వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 546 యాక్టివ్ కేసులు ఉన్నాయి.   

Follow Us:
Download App:
  • android
  • ios