వైసీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌  తెలిపారు.

వైసీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ బుధవారం తెలిపారు. తితలీ తుఫాన్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైదంటూ మంగళవారం సాయిరాజ్‌ సోంపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో సాయిరాజ్‌పై వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.