యూట్యూబ్ వీడియో కోసం వన్యప్రాణిని చంపిన ముగ్గురు: అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు
అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం లక్ష్మీపురంలో వన్యప్రాణిని చంపిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం:అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం లక్ష్మీపురంలో వన్యప్రాణిని చంపిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్ వీడియో కోసం వన్యప్రాణిని ముగ్గురు యువకులు చంపారు. ఈ విషయమై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ముగ్గురు యువకులు వన్యప్రాణిని చంపినట్టుగా పోలీసులు గుర్తించారు.యూట్యూబ్ వీడియోలకు ఎక్కువ వ్యూస్ కోసం వన్యప్రాణిని చంపినట్టుగా గుర్తించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వన్యప్రాణులను చంపిన ఘటనలు గతంలో కూడ నమోదయ్యాయి.హైద్రాబాద్ లో జింక, దుప్పి మాంసం అమ్ముతున్న ముఠాను ఈ ఏడాది ఆగస్టు 14న అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 16 కేజీల మాంసాన్ని సీజ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిధిలోని గగన్ పహాడ్ లో తనిఖీలు చేసిన సమయంలో జింక, దుప్పి మాంసం విక్రయిస్తున్నారనే సమాచారంతో అరెస్ట్ చేశారు.
2019లో హైద్రాబాద్ బహదూర్ పురాలో మాంసం పేరుతో జింక మాంసం విక్రయించే జమీర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలం టీవీటీపల్లి అటవీ ప్రాంతంలో జింక మాంసం కలకలం రేపింది. జింకను వేటగాళ్లు హతమార్చినట్టుగా అటవీశాఖాధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. 2021లో అనంతపురం జిల్లాలో జింక మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.