రోజు రోజుకి  సైబర్ నేరాలు  పెరిగిపోతూనే  ఉన్నాయి.  ముంబై  కేంద్రంగా  సైబర్ నేరాలకు పాల్పడుతున్న విశాఖపట్టణానికి చెందిన  శ్రీనివాస్ అనే వ్యక్తిని  పోలీసులు అరెస్ట్  చేశారు. 

ముంబై: ముంబై కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న విశాఖపట్టణానికి చెందిన శ్రీనివాస్ ను పోలీసులు బుధవారంనాడు అరెస్ట్ చేశారు. పలు యాప్ ల పేరుతో శ్రీనివాస్ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఫైవ్ స్టార్ హోటళ్లలో మకాం వేసి శ్రీనివాస్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ప్రతి రోజూ రూ 5 కోట్లు లక్ష్యంగా శ్రీనివాస్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. హైద్రాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో శ్రీనివాస్ బాధితులున్నారని పోలీసులు చెబుతున్నారు. 

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. సైబర్ నేరాల విషయమై పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నరు. కానీ సైబర్ నేరగాళ్లు కొత్త రూపంలో నేరాలకు పాల్పడుతున్నారు.