ఏలూరు:పశ్చిమ గోదావరి జిల్లా భౌద్ధారామంలో ప్రేమికుల జంటపై దాడికి పాల్పడిన రాజును మంగళవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు.

నవీన్, శ్రీధరణిలు ప్రేమికులు.  వీరిద్దరూ రెండు రోజుల క్రితం బౌద్ధారామాలయానికి వచ్చారు. ఆ సమయంలో శ్రీధరణి హత్యకు గురైంది. నవీన్ ‌కూడ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

శ్రీధరణి హత్యకు నవీన్ కారణమని ఆమె కుటుంబసభ్యులు ఆరోపణలు కూడ చేశారు. అయితే ఈ విషయమై టెక్నాలజీ సహాయంతో పోలీసులు రాజు అనే వ్యక్తిని  అదుపులోకి తీసుకొన్నారు.

బౌద్ధారామాలయాలు, జీలకరగట్టు ప్రాంతాల్లో అడవి పందులు, పక్షుల వేటకు రాజు ప్రతి నిత్యం వచ్చేవాడు. అయితే ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు,  ఏకాంతం కోసం వచ్చే ప్రేమికుల నుండి రాజు బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడుగా గుర్తించారు.

అయితే రాజుపై ఇప్పటివరకు ఎవరూ కూడ ఫిర్యాదు చేయలేదు. దీంతో ఈ విషయం వెలుగు చూడలేదు.  కానీ, ఆదివారం నాడు నవీన్, శ్రీధరణిలు ఏకాంతం కోసం ఈ ప్రాంతానికి వచ్చారు.

ఈ ప్రాంతానికి వచ్చిన నవీన్,శ్రీధరణిలను గమనించిన రాజు తొలుత నవీన్‌పై కర్రతో కొట్టాడు. దీంతో అతను స్ఫృహ కోల్పోయాడు. నవీన్ కిందపడిపోగానే శ్రీధరణిపై రాజు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.ఈ సమయంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో శ్రీధరణిపై రాజు కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

శ్రీధరణి వద్ద ఉన్న మొబైల్‌ఫోన్‌ను తీసుకొని తన సెల్‌పోన్‌లోని సిమ్‌ను  వేసుకొన్నాడు. మొబైల్ డంప్ టెక్నాలజీ సహాయంతో నిందితుడు రాజును పోలీసులు గుర్తించారు.

శ్రీధరణి ఉపయోగించిన ఫోన్‌ను ఆన్ చేయడంతో  జి.కొత్తపల్లిలో రాజు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.కృష్ణా జిల్లాకు చెందిన రాజు తన అత్తగారి ఇంటి వద్ద ఉంటున్నారు. జీలకరగట్టు ప్రాంతానికి వేట పేరుతో వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.