తాను సహజీవనం చేస్తున్న  మహిళ మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసి తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో తన ప్రేయసి అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని చంపేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పర్చూరు అద్దంకమ్మ మాన్యంలో ఉంటున్న మీరాబి(35)  సయ్యద్ బాబు అనే వ్యక్తితో 15 సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. కాగా.. ఆమె ఇటీవల మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. దీంతో.. ఈ విషయం సయ్యద్ బాబు కి తెలియడంతో రగిలిపోయాడు. మీరాబితో కొత్తగా సంబంధం పెట్టుకున్న వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. కాగా.. నిందితుడు సయ్యద్ బాబుని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

ఈ ఘటన గురించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు.. దర్శి మండలం కట్టసింగన్నపాలెం గ్రామానికి చెందిన మీరాబి కి 20 సంవత్సరాల క్రితం పెళ్లైంది. భర్త చనిపోవడంతో 15 సంవత్సరాల నుంచి పర్చూర్ లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఎలక్ట్రీషియన్ సయ్యద్ బాబుతో పరిచయం ఏర్పడింది.
 
అప్పటి నుంచి వారిద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు కాగా.. ఇటీవల మీరాబికి ఓ ఆటో డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం సయ్యద్ బాబుకి తెలియడంతో.. కోపంతో ఆటో డ్రైవర్ ని గొంతు కోసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.