Asianet News TeluguAsianet News Telugu

పోలవరంలో టర్బైన్ల అమరికకు కాంక్రీట్ పనులు ప్రారంభం

పోలవరం జల విద్యుత్ కేంద్రంలో టర్బైన్ల అమరికకకు కాంక్రీట్ పనులు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. విద్యుత్  ఉత్పాదనలో కీలకమైన టర్బైన్ ల అమరికకు అవసరమైన కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టారు. 

Polavaram Project power plant Turbine work begins
Author
Guntur, First Published Aug 8, 2022, 8:11 PM IST


అమరావతి: Polavaram జల విద్యుత్ కేంద్రంలో టర్బైన్ల  అమరికకు కాంక్రిట్ పనులు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి.  విద్యుత్  ఉత్పాదన లో కీలకమైన టర్బైన్ ల అమరికకు  అవసరమైన కాంక్రిట్ పనులకు శ్రీకారం చుట్టారు.. కాంక్రిట్ పనులను ఏపీ జెన్ కో ఎస్ ఈ శేషారెడ్డి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్ ఇవాళ ప్రారంభించారు 

జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 12 Turbine లను అమర్చనున్నారు. ఒక్కో టర్బైన్ అమర్చేందుకు 3500 మెట్రిక్ క్యూబ్ ల కాంక్రీట్ వినియోగించనున్నారు . మొత్తం 42 వేల మెట్రిక్ క్యూబ్ ల కాంక్రీట్ ను ఇందు కోసం వినియోగిస్తారు. ఇప్పటికే టర్బైన్ ల ఏర్పాటుకు అనువుగా పోలవరం జల విద్యుత్ కేంద్రం లో టన్నెల్స్  తవ్వకం పూర్తైంది. 

Polavaram Project power plant Turbine work begins

ఫెర్రెల్స్ ను అమరుస్తున్నారు. కాంక్రిట్ పనులు, ఫెర్రెల్స్ అమరిక కూడా పూర్తైన తరువాత టర్బైన్  పనులు  ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.  కాంక్రిట్ పనుల ప్రారంభ కార్యక్రమంలో  మేఘా ఇంజనీరింగ్ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. ముద్దుకృష్ణ , డి జి ఎం లు రాజేష్ కుమార్, క్రాంతి కుమార్, సీనియర్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios