polavaram project: జగన్‌ సర్కార్‌కి కేంద్రం షాక్

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జగన్ సర్కార్ కి షాక్ ఇచ్చింది.2013-14నాటి ధరల మేరకు రూ.20,398.61 కోట్ల తుది అంచనా వ్యయానికే కట్టుబడి ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. రూ.1,086.38 కోట్ల బిల్లులను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది.

polavaram poject: union government rejects Rs.1,086.38 crore bills


అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు (polavaram project )సంబంధించి రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం (union government) గట్టి షాకే ఇచ్చింది. పనుల కోసం ఖర్చుచేసిన రూ.1,086.38 కోట్ల బిల్లులను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. 2013-14నాటి ధరల మేరకు రూ.20,398.61 కోట్ల తుది అంచనా వ్యయానికే కట్టుబడి ఉన్నట్టుగా ఈ బిల్లులను తిరస్కరించడం ద్వారా తేల్చి చెప్పినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

also read:పోలవరం ప్రాజెక్ట్.. నిర్వాసితులను గోదారిలో ముంచేశారు: వైసీపీ సర్కార్‌పై దేవినేని ఆగ్రహం

ఇంతకుమించి పైసా ఖర్చుచేసినా రీయింబర్స్‌ (reimbursement) ప్రసక్తే లేదని తేల్చేసింది. అంతేకాదు.. 2017-18 ధరల ప్రకారం సవరించిన తుది అంచనాలు రూ.55,656.87 కోట్లకు అంగీకరించేది లేదని కూడా స్పష్టంచేసింది. ఆ మొత్తానికి ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌ ఇవ్వాలన్న జగన్‌ సర్కారు విజ్ఞప్తులనూ తోసిపుచ్చింది.

పోలవరం పనులకు చేసిన ఖర్చును రీయింబర్స్‌ చేయాలంటూ రాష్ట్రం పంపిన రూ.1,086.38 కోట్ల బిల్లులను జలశక్తి శాఖ (jal shakti) పరిశీలించింది. దీనిలో రూ.805.68 కోట్లు తాను ఆమోదించిన తుది అంచనా వ్యయం రూ.20,398 కోట్లకు మించి ఉన్నాయని భావించింది. 

మరో రూ.280.69 కోట్ల విలువైన పనులు డీపీఆర్‌లో (dpr) లేవని స్పష్టంచేసింది. ఆ బిల్లులన్నిటినీ తోసిపుచ్చింది. ఛత్తీ‌ష్‌ఘడ్, ఒడిశాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పోలవరం పనులపై జారీ అయిన ‘స్టాప్‌వ ర్క్‌ ఆర్డర్‌’ ఆదేశాలపై కేంద్ర పర్యావరణ శాఖ మొన్నటివర కు నిషేధం పొడిగిస్తూ వచ్చింది.ఈ నిషేధాన్ని మరోసారి పొడిగించేలా కేంద్రాన్ని ఒప్పించడంలో జగన్‌ సర్కారు విఫలమైంది. దీంతో పనుల కొనసాగింపునకు గ్రహణం పట్టినట్లయింది. 

నిధుల మాట తర్వాత కీలక సాంకేతిక అంశాలపైనా రాష్ట్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు. అంచనా వ్యయాన్ని రూ. 55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని కోరుతూ సీఎం జగన్‌ లేఖ రాశారు. 

ఈ విషయమై  ప్రధానిని కలసినప్పుడు వినతిపత్రం అందజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కూడా వినతిపత్రాలు ఇచ్చారు. అలాగే రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఈ విషయమై విన్నవించారు. అయితే తుది అంచనా వ్యయం పెంపు దిశగా కేంద్రం కదులుతున్న సూచనలే కనిపించడంలేదు.

రూ. 55,656.87 కోట్లకు ఇన్వె్‌స్టమెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చేందుకు కూడా తిరస్కరించింది. కేంద్రం నుంచి నిధులు రాక.. చేసిన ఖర్చు రీయింబర్స్‌ కాక రాష్ట్రం విలవిలలాడుతోంది. 45.72 మీటర్ల కాంటూరు వరకు భూసేకరణ చేయాలంటే రూ.24 వేల కోట్లు కావాలి. ఇంత భరించే శక్తి లేకపోవడంతో 41.15 మీటర్ల కాంటూరుకే పరిమితమయ్యేందుకు సిద్ధమైంది. 

ఇందుకు రూ.3,500 కోట్లు వ్యయం చేస్తే చాలని గత ఏడాది నుంచి జలవనరుల శాఖ అధికారులు చెబుతూనే ఉన్నా రు. ఈ నెల 1న జరిగిన సమీక్షలోనూ ప్రస్తావించారు. గత మార్చినాటికే నిధులిస్తామని సీఎం సమీక్షా సమావేశాల్లో హామీ ఇచ్చారు. అయితే పైసా విడుదల చేయలేదు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios