Asianet News TeluguAsianet News Telugu

పోలవరం నుంచి నవయుగ ఔట్... కేంద్రం అసంతృప్తి

పోలవరం జాతీయ ప్రాజెక్టే అయినా నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో వేఅవినీతి జరిగిందని ఆరోపిస్తోన్న  వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామ ని ప్రకటించింది. ఆ దిశగానే నవయుగకు 60 సీ నోటీసులు ఇచ్చింది. పనులు ఆపేయాలని ఆ సంస్థను ఆదేశించింది. 

Polavaram: AP move sad and costly, says Union minister in Lok Sabha
Author
Hyderabad, First Published Aug 3, 2019, 8:49 AM IST

పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగ కంపెనీని తొలగిస్తూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరమని పేర్కొంది. దీనివల్ల పోలవరం ఎప్పటిలోగా పూర్తవుతుందో కూడా చెప్పలేమని విచారం వ్యక్తం చేసింది. 

పోలవరం జాతీయ ప్రాజెక్టే అయినా నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో వేఅవినీతి జరిగిందని ఆరోపిస్తోన్న  వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామ ని ప్రకటించింది. ఆ దిశగానే నవయుగకు 60 సీ నోటీసులు ఇచ్చింది. పనులు ఆపేయాలని ఆ సంస్థను ఆదేశించింది. 

కాగా, జలాశయాల భద్రతపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరిగిన సమయంలో పోలవరం అంశాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు. దీనికి కేం ద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ బదులిచ్చా రు. టెండర్లు రద్దు చేయడం వల్ల ఆ ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని కేంద్రమంత్రి ఆందోళన వ్య క్తం చేశారు.

 ‘పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుందోనని సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. పోలవ రం నిర్మాణ పనులను రాష్ట్రమే చూసుకుంటోంది.నిర్మా ణ పనుల్లో ఉన్న సంస్థ కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం ర ద్దు చేసిందని చెప్పడానికి విచారిస్తున్నాను. ఈ నిర్ణ యం పోలవరం ప్రాజెక్టుకు మరో అవరోధంగా మారుతుంది. దీనివల్ల ప్రాజెక్టు పూర్తికి ఎంత కాలం పడుతుం దో చెప్పలేం. అలాగే ఖర్చు భారీగా పెరుగుతుంది’ అని షెకావత్‌ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios