కృష్ణా జిల్లా నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసం వెలుగు చూసింది. హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న గుడ్రం రవితేజ చేతివాటం చూపించారు.
కృష్ణా జిల్లా నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ మోసం వెలుగు చూసింది. హెడ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న గుడ్రం రవితేజ చేతివాటం చూపించారు. ఖాతాదారుల నుంచి రూ.1.56 కోట్లు కొట్టేశాడు. ఆన్‌లైన్‌లో రమ్మీ, కాసినో ఆటకు అలవాడు పడ్డ రవితేజ.. తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఖాతాదారుల నగదును తన ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాడు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ తనిఖీ చేయడంతో రవితేజ బాగోతం బయటపడింది. దీంతో ఆయన రవితేజపై నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
