వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ పట్ల ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి నుంచి ఆదివారం ఢిల్లీ వెళ్లిన జగన్.. ప్రధానిని కలిశారు. దాదాపు గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని సమస్యలు, విభజన హామీలను ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం భేటీ వివరాలను ప్రధాని ట్వీట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘ ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నాను’’ అంటూ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.