ఆంధ్రప్రదేశ్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది.  విజయవాడ - చెన్నైల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జూలై 7వ తేదీన వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. విజయవాడ - చెన్నైల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జూలై 7వ తేదీన వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. విజయవాడ, చెన్నై నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత క్రమబద్ధీకరించనుంది. ఈ రైలు విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదుగా చెన్నైకి చేరుకోనుంది. తిరిగి అదే మార్గం చెన్నై నుంచి విజయవాడకు చేరుకోనుంది. ఇక, విజయవాడ నుంచి తిరుపతి మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా.. రేణిగుంట జంక్షన్ మీదుగా నడపాలని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరినట్లు తెలిసింది. 

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టడం వల్ల విజయవాడ-చెన్నై మార్గంలో రద్దీని కొంతవరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇక, ఇప్పటికే ఏపీ- తెలంగాణల మధ్య.. రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం- సికింద్రాబాద్, సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రెండు సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించిందని రైల్వే అధికారులు తెలిపారు.