పీలేరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు పీలేరు నుంచే ప్రాతినిధ్యం వహించారు. దాదాపు 5 దశాబ్లాలుగా నల్లారి కుటుంబం పీలేరు నుంచే రాజకీయాలు కొనసాగిస్తోంది. నల్లారి అమర్‌నాథ్ రెడ్డి.. పీవీ నరసింహారావు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి.. ఎమ్మెల్యేగా, చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా , సీఎంగా సేవలందించారు. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరి యాక్టీవ్‌గా వున్నారు.  

Pileru Assembly elections result 2024 AKP

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం .. ఈ పేరు వినగానే ఉద్ధండులు గుర్తొస్తారు. దేశానికి హేమాహేమీలైన నేతలను ఈ సెగ్మెంట్ అందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు పీలేరు నుంచే ప్రాతినిథ్యం వహించారు. ఈ నియోజవర్గంపై నల్లారి కుటుంబం పట్టు ఎక్కువ. ప్రజలను పేరు పెట్టి మరీ మాట్లాడేంత చనువు వీరిది. దాదాపు 5 దశాబ్లాలుగా నల్లారి కుటుంబం పీలేరు నుంచే రాజకీయాలు కొనసాగిస్తోంది. 

 హేమాహేమీలను అందించిన గడ్డ :

నల్లారి అమర్‌నాథ్ రెడ్డి.. పీవీ నరసింహారావు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి.. ఎమ్మెల్యేగా, చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా , సీఎంగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరి యాక్టీవ్‌గా వుంటున్నారు. రెడ్డి, ముస్లిం , శెట్టి బలిజ సామాజికవర్గాలదే పీలేరులో ఆధిపత్యం. 1955 ఎన్నికలు తప్పించి ఇప్పటి దాకా ఎమ్మెల్యేలుగా గెలిచినవారంతా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే . 

1952లో పీలేరు నియోజకవర్గం ఏర్పడగా.. కాంగ్రెస్ పార్టీ.. 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ, కేఎల్‌పీలు రెండు సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి. పీలేరు నియోజకవర్గం పరిధిలో గుర్రంకొండ, వాల్మీకిపురం, పీలేరు, కలికిరి, కలకడ, కంభంవారిపల్లె మండలాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డికి 87,300 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ఎన్ కిశోర్ కుమార్ రెడ్డికి 79,426 ఓట్లు పోలయ్యాయి. దీంతో రామచంద్రారెడ్డి వరుసగా రెండోసారి పీలేరు నుంచి గెలిచారు. 

  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios