Asianet News TeluguAsianet News Telugu

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని హైకోర్టులో సోమవారం నాడు  పిటిషన్ దాఖలు అయింది. 

petition files in AP High court on municipal elections lns
Author
Guntur, First Published Feb 22, 2021, 6:46 PM IST

అమరావతి: ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని హైకోర్టులో సోమవారం నాడు  పిటిషన్ దాఖలు అయింది. 

మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ఓటరు లిస్టు ప్రకారం ఎన్నికలు జరపాలని, అప్పుడే చాలా మందికి పోటీ చేసే అవకాశం కలుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఓటు ఉంటేనే పోటీ చేసే అవకాశం కలుగుతుందని, లేకపోతే ఉండదని తెలిపారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. 

పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు పూర్తయ్యాయి. మున్సిపల్ ఎన్నికలపై  ఎస్ఈసీ కేంద్రీకరించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని  జిల్లాల అధికారులకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాతి స్థానంలో టీడీపీ నిలిచింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios