మాజీ స్పీకర్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ పై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. నాదెండ్ల మనోహర్ అవకాశవాద రాజకీయ నాయకుడంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన నాదెండ్ల మరికొద్దిరోజులు ఓపికపట్టలేరా అని ప్రశ్నించారు. నాదెండ్లను జనసేనలోకి తీసుకోవడం అనైతికమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విజయవాడ: మాజీ స్పీకర్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ పై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. నాదెండ్ల మనోహర్ అవకాశవాద రాజకీయ నాయకుడంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన నాదెండ్ల మరికొద్దిరోజులు ఓపికపట్టలేరా అని ప్రశ్నించారు. నాదెండ్లను జనసేనలోకి తీసుకోవడం అనైతికమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ, వైసీపీ అధినేత జగన్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చడానికే ఐటీ దాడులని విమర్శించారు. 

మరోవైపు పారిశూధ్యకార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రఘువీరా అన్నారు. 25వేల మంది కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదని ధ్వజమెత్తారు. కార్మికుల శ్రమను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెడుతుందంటూ మండిపడ్డారు. మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.