ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్... ప్రతి గ్రామంలో గ్రామ వాలంటీర్లను నియమించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగ సమస్యను పరిష్కారంలో భాగంగా ఈ గ్రామ వాలంటీర్ల విధానాన్ని జగన్ ప్రవేశపెట్టారు. అయితే..  ఈ గ్రామ వాలంటీర్ల విధానంపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గవర్నర్ కి లేఖ రాశారు.

గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియకు సంబంధించి రఘువీరా రెడ్డి లేఖ రాశారు. ప్రతిభ ఆధారంగా గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయాలని ఆయన కోరారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్హత ఆధారంగా వెయిటేజీ ఇవ్వాలని సూచించారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తే ఆందోళనకు దిగుతామని రఘువీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.