టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇంతకాలం టీడీపీ ఎమ్మెల్సీగా, శాసనమండలి చీఫ్ విప్ గా ఆయన కొనసాగారు. అయితే... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఉరవకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. రాష్ట్రమంతా వైసీపీ నేతలు ప్రభంజనం సృష్టించినా పయ్యావుల కేశవ్ మాత్రం విజయకేతనం ఎగురవేశారు.

ఈ నేపథ్యంలో కేశవ్‌ ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఆయన 2015లో జిల్లాలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2021 వరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగేందుకు అవకాశం ఉంది. అయినా ఎమ్మెల్యేగా కొనసాగాలని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పయ్యావుల రాజీనామాను శాసనమండలి ఆమోదించింది. దీంతో ఇక నుంచి కేశవ్‌ శాసనసభ్యుడిగా కొనసాగనున్నారు. అసెంబ్లీలో తన గళాన్ని వినిపించనున్నారు.