పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live
పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి కంబాల జోగులు పోటీ చేయగా, టీడీపీ నుంచి వంగలపూడి అనిత మరోసారి పోటీ చేశారు. ఇద్దరిలో విన్ అయ్యేది ఎవరనేది కాసేపట్లో తేలనుంది.
ఉత్తరాంధ్రలో తెలుగుదేశం, వైసిపి రెండూ బలంగా వున్న నియోజకవర్గం పాయకరావుపేట. టిడిపి ఆవిర్భావం నుండి 2009 వరకు పాయకరావుపేటలో టిడిపికి ఎదురేలేదు. 1983 లో సుమన గంతేల, 1985, 1989, 1994 కాకర నూకరాజు, 1999, 2004 లో చెంగల వెంకటరావు టిడిపి తరపున పోటీచేసి వరుస విజయాలు అందుకున్నారు. 2014 లో వంగలపూడి అనిత విజయం సాధించారు.
ఇక ప్రస్తుత పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనిచేసారు. 2009 లో పాయకరావుపేట నుండి గెలిచిన బాబూరావు వైఎస్ జగన్ పార్టీ పెట్టడంతో రాజీనామా చేసిమరి అందులో చేరారు. ఇలా 2012 లో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన మళ్ళీ గెలిచారు.
అయితే మొదటినుండి తనవెంట వున్న బాబూరావును రాజ్యసభకు పంపించారు వైఎస్ జగన్. దీంతో ఈసారి పాయకరావుపేటలో కంబాల జోగులు వైసిపి అభ్యర్థిగా పోటీచేశారు. టిడిపి మాత్రం వంగలపూడి అనితనే మరోసారి బరిలోకి దింపింది.
పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. కోటవురేట్ల
2. నక్కపల్లి
3. పాయకరావుపేట
4. ఎస్. రాయవరం
పాయకరావుపేట అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,40,678
పురుషులు - 1,19,330
మహిళలు - 1,21,346
పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి కంబాల జోగులు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి వంగలపూడి అనిత మరోసారి పోఈ చేసింది. ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. ఎవరు విన్ అనేది కాసేపట్లో తేలనుంది.
పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన అనిత వంగలపూడి 1,20,042 ఓట్లతో విజయం సాధించారు.
పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,95,725 (81 శాతం)
వైసిపి - గొల్ల బాబూరావు - 98,745 ఓట్లు (50 శాతం) - 31,189 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - బి. బంగారయ్య - 67,556 ఓట్లు (34 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - నక్కా రాజాబాబు - 15,921 (8 శాతం)
పాయకరావుపేట అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,79,843 ఓట్లు (80 శాతం)
టిడిపి - వంగలపూడి అనిత - 86,355 (48 శాతం) - 2,828 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - చంగాల వెంకటరావు - 83,527 (46 శాతం) - ఓటమి
- Andhra Pradesh Assembly Election Results 2024 Live Updates
- Chandrababu naidu
- Payakaraopeta assembly elections result 2024
- Payakaraopeta assembly elections result 2024 live
- Sharmila
- TDP
- Telugu Desam Party
- YSR Congress Party
- YSRCP
- ap assembly elections 2024
- congress
- janasena
- kambaala jogulu
- vangalapudi anitha
- ys jagan