Asianet News TeluguAsianet News Telugu

బీజేపీకి షాక్ : విశాఖ ఉక్కు పోరాటంలో పవన్‌ పాల్గొంటారు... నాదెండ్ల మనోహర్

త్వరలోనే అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ విశాఖ వచ్చి ఉక్కు పరిరక్షణ పోరాటంలో పాల్గొంటారని వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ పోరాటంపై దేశం మొత్తం మాట్లాడేలా ముందుకు వెళ్లాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితులతో జనసేన నేతలు విశాఖపట్నంలో సమావేశమయ్యారు. 

Pawan kalyan will enter the anti-privatization movement at the Visakhapatnam steel plant : Nadendla Manohar
Author
Hyderabad, First Published Sep 20, 2021, 1:15 PM IST

విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ సరికాదని, విశాఖ ఉక్కు కర్మాగారం భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయంలో జనసేన పార్టీ చాలా స్పష్టతతో ఉందని  ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. 

మొదటి నుంచి అదే స్టాండ్‌కు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ విశాఖ వచ్చి ఉక్కు పరిరక్షణ పోరాటంలో పాల్గొంటారని వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ పోరాటంపై దేశం మొత్తం మాట్లాడేలా ముందుకు వెళ్లాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, స్టీల్‌ ప్లాంట్‌ నిర్వాసితులతో జనసేన నేతలు విశాఖపట్నంలో సమావేశమయ్యారు. 

వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరై 220 రోజులుగా తాము చేస్తున్న పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ‘‘ మాట తప్పం మడమతిప్పమని గొప్పలు చెప్పుకునే నాయకులు పార్లమెంట్‌లో ఒక మాట, ఇక్కడో మాట మాట్లాడుతున్నారు. చిత్తశుద్ధిలేని రాజకీయ పార్టీలతో కాకుండా కార్మిక సంఘాలతో ఏర్పాటైన జేఏసీ పోరాటానికి అండగా ఉండాలని పవన్‌ సూచించారు. ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర పెద్దలు సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా మనందరం కలిసి పోరాటం చేద్దాం’’ అని నాదెండ్ల మనోహర్‌ అన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios