పవన్ కి వీర తిలకం దిద్దుతున్న మూడో భార్య.. రెండో భార్య కొడుకు, విజయోత్సాహంతో బయలుదేరిన పవర్ స్టార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘన  విజయం తో అటుఫ్యాన్స్ తో పాటు.. ఇటు కుటుంబ సభ్యులు కూడా పండగ చేసుకుంటున్నారు. పవర్ స్టార్ కు భార్య వీర తిలకం దిద్దిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 
 

Pawan Kalyan Wife Anna Lejonova and Son Akhira Nandan Video viral JMS

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్ తో పాటు కుటుంబ సభ్యులు. అయితే ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పవన్ కళ్యాన్ కు ఆయన మూడో భార్య అన్నా లేజోనోవా.. హారతి ఇచ్చి.. వీరి తిలకం దిద్ది పంపించారు. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. పవర్ స్టార మూడో భార్య తో పాటు.. ఆయన రెండో భార్య రేణూ దేశాయ్ తనయుడు.. పవన్ వారసుడు అకీరా నందన్ కూడా వీరితో ఉండటం విశేషం. 

 

పిన్నితో పాటు.. అకీరా తండ్రి పవర్ కళ్యాణ్  కు వీరతిలకం దిద్ది పంపించడం ప్రస్తుతం వైరల్ గా మారింది. కూటమిగా ఏర్పడిన జనసేన పోటీ చేసిన 21 స్థానల్లో విజయం సాధించడంతో పాటు రెండు ఎంపీ స్థానల్లో కూడా పోటీ చేసి గెలిచింది. దాంతో పవర్ స్టార్ కు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అటు రేణూ దేశాయ్ కూడా పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతారని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇటు మెగాప్యామిలీలో పండగ వాతావరణం నెలకొనగా..  ఇటు ఫ్యామిలీతో పాటు ఈసందర్భంలో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. 

బైబై వైసీపీ నినాదాలతో రాష్ట్రమంతా ప్రభావం చూపిన జనసేనాని.. లాస్ట్ టైమ్ ఎలక్షన్స్ లో రెండు చోట్ల ఓడిపోయి.. ఎన్నో విమర్షలు ఎదుర్కొన్నారు. ఇక ఈసారి మాత్రం పిఠాపురం నుంచి భారీమెజారిటీతో గెలిచి మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఏపీలో కూటమి భారీ స్థాయిలో విజయం సొంతం చేసుకోగా.. జనసేన నిలబడ్డ 21 సీట్లలో 20 సీట్లు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో పవర్ స్టార పవన్ కళ్యాణ్ భార మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు. 

14 వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి పవర్ స్టార్ 70  వేల వరకూ మెజారిటీతో వంగా గీతను ఓడించారు. దాంతో ..ఇక రాష్ట్రం అంతా కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి 15 సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈక్రమంలో పవర్ స్టార్ విజయంతో పాటు.. దాదాపు 20సీట్లు సాధిస్తోన్న జనసేనకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అంతే కాదు మెగా ప్యామిలీతో పాటు.. ఇండస్ట్రీలో నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios