అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ఎన్నికలకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలపై పోరాటాలు చేయాలని భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు.

ఏపీ రాష్ట్రంలో  పవన్ కళ్యాణ్  పోరాట యాత్రల పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పోరాట యాత్రలను నిలిపివేయాలని  పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు. ఏపీలో  త్వరలో ఎన్నికల  వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.

అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలకు వీలుగా జనసేన క్యాడర్‌ను సన్నద్దం చేసేందుకు పవన్ కళ్యాణ్  ప్లాన్ చేస్తున్నారు ఆయా జిల్లాల్లో నెలకొన్న సమస్యలను తీసుకొని ఆందోళనలు నిర్వహించాలని పవన్ భావిస్తున్నారు.

ఆయా జిల్లాల్లో నెలకొన్న సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాటం చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే పోరాట యాత్రలను నిలిపివేశారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పవన్ కళ్యాణ్  విస్తృతంగా పర్యటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉన్నందున పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.

జిల్లాల పర్యటన కారణంగా ఆయా జిల్లాల్లో నెలకొన్న సమస్యలపై పోరాటం చేయడంతో పార్టీ క్యాడర్‌ను కూడ ఎన్నికలకు సన్నద్దం చేసే అవకాశం కూడ ఉంటుందని పవన్ భావిస్తున్నారు. 

ఈ నెల 13వ తేదీన గుంటూరు జిల్లా నుండి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహార్ వ్యవసాయ పొలంలో రైతులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.

ఈ సమావేశం సందర్భంగా  పవన్ కళ్యాణ్ వ్యవసాయానికి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులకు అందుబాటులోనే ఉంటూ జిల్లాల్లో పర్యటనలు చేసేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు.