అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఆయనకు గొంతు నొప్పితో పాటు, జ్వరంతో బాధపడుతున్నారని తెలిసింది.

జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌‌ను వైద్యులు పరీక్షించారు. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్‌ను రెండు రోజుల పాటు  విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.డిసెంబర్ 14 వ తేదీన పవన్ కళ్యాణ్  అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అయితే జ్వరం కారణంగా పవన్ కళ్యాణ్ అమెరికాకు వెళ్తారా లేదా అనేది  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

డిసెంబర్ 14 వ తేదీ నుండి మూడు రోజుల పాటు అమెరికాలో పలు కార్యక్రమాల్లో  పాల్గొనాల్సి ఉంది.  అమెరికాలోని జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్  పాల్గొనాల్సి ఉంది. పవన్ కళ్యాణ్  అమెరికా టూర్ గురించి స్పష్టత రావాల్సి ఉంది.