Asianet News TeluguAsianet News Telugu

పవన్ కల్యాణ్ శ్రమదానంపై ఉత్కంఠ: జనసేన నేతల హౌస్ అరెస్టు

భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.అధికారుల సూచనతో  హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. సభ నిర్వహణకు బాలాజీ పేట రోడ్డు అనువైనది కాదని పోలీసులు తెలిపారు. మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామన్నారు. 

pawan kalyan sramadanam at anantapur
Author
Hyderabad, First Published Oct 2, 2021, 10:02 AM IST

అమరావతి : జనసేన (Janasena)అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)రెండు జిల్లాల్లో సంకల్పించిన శ్రమదానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ రహదారికి పవన్ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. 

భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.అధికారుల సూచనతో  హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. సభ నిర్వహణకు బాలాజీ పేట రోడ్డు అనువైనది కాదని పోలీసులు తెలిపారు. మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామన్నారు. 

మరోవైపు  పవన్ పర్యటన దృష్ట్యా అధికారులు ఈ మార్గంలో  గుంతలు పూడ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని పోలీసులు మూసివేశారు.  రాజమహేంద్రవరం వెళ్లే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.  ఈ మార్గంలో వెళ్లే వాహనాలు తనిఖీ చేసి పంపుతున్నారు.

 రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్ట వ్యతిరేకమంటూ కృష్ణాజిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు.  పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. 

పోలీసులు 144వ సెక్షన్ విధించారు. జనసేన కార్యకర్తలను ముందు జాగ్రత్త చర్యగా హౌస్ అరెస్టులు చేశారు. ఎట్టి పరిస్థితిలోను శ్రమదానం చేపట్టి తీరుతామని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కోవిడ్ నిబంధనలు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తలను, నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆయన చెప్పారు.

పవన్‌కు జగన్ సర్కార్ మరో షాక్: బహిరంగ సభకూ మెలిక, వేదికను మార్చుకోవాలన్న పోలీసులు

కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ ఏం తేలుస్తారు.. గొంగూర కట్ట అంటూ మండిపడ్డారు. గత 15 ఏళ్ల నుంచి ఏం తేలుస్తున్నారో చూస్తూనే వున్నామని బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2009 నుంచి చొక్కాలు చింపుతా అంటున్నారని... ఇప్పటికి ఎన్ని చొక్కాలు చింపారని బొత్స ప్రశ్నించారు. 

మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపైనా కామెంట్స్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన స్నేహితుడిలాగే సోము వీర్రాజుకు కూడా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువంటూ సెటైర్లు వేశారు. కేంద్రం నిధులు ఉపయోగించి  క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించడం లేదని.. ప్రజల భాగస్వామ్యంతో వసూలైన డబ్బుతోనే క్లాప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బొత్స స్పష్టం చేశారు. కేంద్రం నిధులు వుంటే కచ్చితంగా ప్రస్తావిస్తామని సత్తిబాబు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో యూజర్ ఛార్జీల కింద సుమారు రూ.350 కోట్లు వసూలైందని మంత్రి తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మిస్తున్నట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios