ఏపీలో రాక్షస పాలన అంతం కావాలి: విజయవాడలో పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రాక్షస పాలన అంతం కావాల్సిన అవసరం ఉందని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.  

Pawan Kalyan Serious Comments  On  YS Jagan Government

విజయవాడ: ఏపీలో రాక్షస పాలన అంతం కావాలని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  చెప్పారు.  విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో  వారాహి వాహనానికి  పవన కళ్యాణ్   బుధవారం నాడు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని క్షణాల పాటు పవన్ కళ్యాణ్  అభిమానులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం  మీడియాతో మాట్లాడారు. ఇవాళ్టి నుండి రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యంగా ఆయన  పేర్కొన్నారు. అందుకే  వారాహి ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా  పవన్ కళ్యాణ్  వివరించారు. 

తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలో ముందుండాలని ఆయన  ఆకాంక్షను వ్యక్తం  చేశారు. అంతేకాదు  ఈ రెండు తెులుగు రాష్ట్రాలు ఐక్యంగా  ఉండాల్సిన అవసరం ఉందన్నారు.  ఏపీ రాష్ట్రం సుభిక్షంగా  ఉండాలనేదే తన కోరికగా ఆయన పేర్కొన్నారు.  దుర్గమ్మను  దర్శించుకోవడం  తనకు సంతోషంగా  ఉందని ఆయన చెప్పారు.

 వారాహి వాహనానికి కొండగట్టులో పూజను మొదలు పెట్టిన ట్టు చెప్పారు. ఈ పూజల కొనసాగింపుగానే ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో  పూజలు నిర్వహించినట్టుగా పవన్ కళ్యాణ్  తెలిపారు.  ఆలయ ప్రాంగణమైనందునే  ఇక్కడ రాజకీయాలపై  ఎక్కువగా మాట్లాడడం సరైంది కాదని  పవన్ కళ్యాణ్  తెలిపారు. 

 2024 లో  ఏపీ రాష్ట్రంలో   ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో   వైసీపీని అధికారంలోకి రాకుండా  చూస్తానని పవన్ కళ్యాణ్  ప్రకటించారు. అయితే  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని  తన అభిమతమని ఆయన చెప్పారు. విపక్ష పార్టీలు కలిసి పోటీ చేయడం ద్వారా  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా  ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు

also read:విజయవాడ కనకదుర్గ ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

. ఎన్నికల ముందు  పొత్తులపై  స్పష్టత వస్తుందని  పవన్ కళ్యాణ్ నిన్న కొండగట్టులో ప్రకటించారు.  తమ పార్టీ బీజేపీతో పొత్తులో ఉందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  2014లో కాంబినేషన్  విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  కొత్త పొత్తులు కుదిరితే  కొత్త పార్టీలతో కలిసి పోటీ చేస్తామన్నారు. లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని కూడా  పవన్ కళ్యాణ్ ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో  జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయమై  ఈ రెండు పార్టీల నేతలు ఇందుకు సంకేతాలు ఇచ్చారని వారు గుర్తు  చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా  తన వంతు ప్రయత్నం చేస్తానని  పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది.  చంద్రబాబుకు ప్రయోజనం కలిగేలా పవన్ కళ్యాణ్  వ్యవహరిస్తున్నాడని ఆ పార్టీ దుయ్యబడుతున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ప్రజలను  చైతన్యవంతుల్ని చేసేందుకు గాను   పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని సిద్దం  చేసుకున్నారు.

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios