తమ పార్టీకి ఇప్పటికే 18 శాతం బలం ఉందని జనసేన చీప్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఏలూరు: తమ పార్టీకి ఇప్పటికే 18 శాతం బలం ఉందని జనసేన చీప్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్లు సర్వేలు నిర్వహించిన సమయంలో కేవలం నాలుగైదు శాతం మాత్రమే ప్రభావం ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన జనసేన సభల్లో ఆయన ప్రసంగించారు తన ప్రాణాన్నే జనసేనకు పెట్టుబడిగా పెట్టానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తొమ్మిది నెలల్లోనే సీఎం కావాలని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు.

బలమైన సిద్దాంతాలు, విధానాలతో పర్జల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నేరస్తులను తన్ని తరిమేయాల్సిన అవసరం ఉందన్నారు. 

వేలాది కోట్లను పెట్టుబడిగా పెట్టుకొని జగన్ రాజకీయాల్లోకి వచ్చినా... సీఎం అయ్యారా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని కంటే ముఖేష్‌ అంబానీ బలమైన వ్యక్తి. ఆయన ప్రధాని కాగలిగారా. డబ్బులు కాదు.. ప్రజాభిమానం ముఖ్యమని పవన్ చెప్పారు.