జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రను ఇవాళ విశాఖపట్టణంలో ప్రారంభించనున్నారు
విశాఖపట్టణం: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారంనాడు మధ్యాహ్నం విశాఖపట్టణం చేరుకున్నారు. మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించేందుకు గాను ఆయన విశాఖపట్టణం వచ్చారు. ఇవాళ సాయంత్రం జగదాంబ సెంటర్ లో వారాహి యాత్రలో భాగంగా సభ ను నిర్వహించనున్నారు. ఈ సభకు ముందుగా విశాఖ జిల్లాకు చెందిన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన చర్చించనున్నారు. మరో వైపు మాజీమంత్రి పడాల అరుణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
