జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైలు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నాం 1.20 గంటలకు జనసేనాని విజయవాడలో జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఎక్కారు. అక్కడ రైలులో రైల్వే పోర్టర్లతో భేటీ అయ్యారు. పోర్టర్ల సమస్యలను పవన్ విన్నారు. ఆ తర్వాత రైలులో పశ్చిమగోదావరి జిల్లా నూజివీడు చేరుకున్నారు.  

విజయవాడ:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైలు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నాం 1.20 గంటలకు జనసేనాని విజయవాడలో జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఎక్కారు. అక్కడ రైలులో రైల్వే పోర్టర్లతో భేటీ అయ్యారు. పోర్టర్ల సమస్యలను పవన్ విన్నారు. ఆ తర్వాత రైలులో పశ్చిమగోదావరి జిల్లా నూజివీడు చేరుకున్నారు. 

నూజివీడులో మామిడి రైతులు, చెరకు రైతులు, చిరువ్యాపారులతో పవన్ ముచ్చటించారు. రైతులకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కావాలి తమ కష్టాలు తీర్చాలంటూ పవన్ కు రైతులు విన్నవించుకున్నారు. మీలాంటి వాళ్లు సీఎం అయితే తమ బతుకు బాగుంటుందని పవన్ కు తెలిపారు. 

Scroll to load tweet…

ప్రజలమాటలకు పవన్ చిరునవ్వుతో సమాధానం చెప్పారు. రైలులో పవన్ తోపాటు ప్రయాణిస్తున్న ప్రజలు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. నిత్యం ప్రజల్లో తిరుగుతున్నా రైలు ప్రయాణంలో ప్రజల నుంచి సమస్యలను తెలుసుకోవడంలో ప్రత్యేకత ఉందన్నారు. 

విజయవాడ నుంచి 115 రూపాయలతో తుని చేరుకునే ప్రయాణికుడు వారి సమస్యలు ఎన్నో ఉంటాయని ఆ సమస్యలు చెప్పుకునేందుకు ఎవరు లేరని వారు ఆవేదన చెందుతుంటారని వాళ్ల సమస్యలు కూడా వినాలనే ఈ కార్యకర్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

Scroll to load tweet…

మరోవైపు టీడీపీ కాంగ్రెస్ కలయికలపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల కలయిక రాజకీయ ఉనికి కోసమేనని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం వల్లే సమీకరణాలు మారతాయే తప్పపార్టీల కలయికల వల్ల కాదన్నారు. గురువారం ఢిల్లీలో చంద్రబాబు చూపించింది సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ లాంటిదన్నారు. 

కానీ చంద్రబాబు సినిమా ప్లాప్ అవ్వడం ఖాయమన్నారు పవన్. చంద్రబాబు కాంగ్రెస్ తో కలయిక చూస్తుంటే ఆయన ఎక్కడ మెుదలయ్యారో అక్కడికే చేరుకున్నట్లు ఉందన్నారు. చంద్రబాబు ఈ నిర్ణయం 2014లో తీసుకోవాల్సిందని సూచించారు. పార్టీలతో పెట్టుకోవాల్సింది పొత్తు కాదని ప్రత్యేక హోదా కోసం బలమైన పోరాటం చెయ్యాలని సూచించారు. 

పవన్ కళ్యాణ్ రైలు యాత్ర చేపట్టిన నేపథ్యంలో ప్రతీ స్టేషన్ వద్ద అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ కు జేజేలు పలికారు. ప్రతీ స్టేషన్ లోనూ పవన్ కళ్యాణ్ చేతులు జోడించి ప్రజలకు, కార్యకర్తలకు అభిమానులకు అభివాదం తెలిపారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ చేపట్టిన రైలు యాత్ర నూజివీడు అనంతరం ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్ల కోట మీదుగా సాయంత్రానికి తుని చేరుకోనుంది.

ఈవార్తలు కూడా చదవండి.

సామాన్యుడితో పవన్ రైలు యాత్ర