సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  కుటుంబ సభ్యులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు  కుటుంబ సభ్యులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన  కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. 

మీడియాతో మాట్లాడిన తర్వాత.. రాజమండ్రి జైలుకు కొద్ది దూరంలో చంద్రబాబు  కుటుంబం  బస  చేస్తున్న క్యాంప్‌కు వెళ్లారు. అక్కడ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిలను పవన్ పరామర్శించారు. వాళ్లతో కొద్దిసేపు మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా అక్కడే ఉన్నారు.