అమరావతి:  తనకు ఓటేయకుండా  పార్టీని ఎలా నడపాలో  తనకు  సలహాలు ఇవ్వకూడదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాల్లో జరిగిన పార్టీ అభ్యర్ధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం నాడు అమరావతిలో రాయలసీమ జిల్లాల్లో పోటీ చేసిన అభ్యర్ధులతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో పార్టీ నేతల తీరుపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. 

ఈ సమావేశంలో  జనసేన నేతల తీరుపై పవన్ కళ్యాణ్ అసహానం వ్యక్తం చేశారు.  తిరుపతిలో రౌడీయిజం పెరిగిపోతే ఎవరు కంట్రోల్ చేస్తారని ఆయన ప్రశ్నించారు.జనాలంతా కలిసి తనను ఓడించినా తాను మాత్రం వెనక్కి తగ్గనని ఆయన తేల్చి చెప్పారు.  కార్యకర్తలెవరూ కూడ పోరాడడం లేదన్నారు. తనను రెండు చోట్ల ఓడించినా కూడ తాను మాత్రం వెనక్కు తగ్గనని ఆయన  స్పష్టం చేశారు.