Asianet News TeluguAsianet News Telugu

పవన్ వీరాభిమాని ఆత్మహత్య

తన అంత్యక్రియలు పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించారు. ఆయన తప్పకుండా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

pawan kalyan fan anil commits sucide
Author
Hyderabad, First Published Sep 4, 2018, 12:40 PM IST

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడకు చెందిన కొమరవల్లి అనిల్‌ కుమార్‌ సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని తల్‌వాకర్స్‌ జిమ్‌లో ట్రైనర్‌గా అనిల్‌ పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా అతడు డిప్రెషన్‌లో ఉన్నట్టు తెలిసింది. చనిపోయే ముందు పవన్‌ కల్యాణ్‌కు అనిల్‌ ఓ లేఖ రాశారు. దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

తన అభిమాన నటుడు పవన్‌ కల్యాణ్‌, తాను చనిపోయిన తర్వాత చూడటానికి రావాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే తన అంత్యక్రియలు పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించారు. ఆయన తప్పకుండా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios