Asianet News TeluguAsianet News Telugu

నాకు భయపడే చంద్రబాబు ఎన్నికలు పెట్టలేదు : పవన్ కళ్యాణ్

ముఖ్యమంత్రి పదవి వారసత్వం కాదని ఒక బాధ్యత అని జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్రలో భాగంగా పర్యటిస్తున్న పవన్ కొయ్యల గూడెం బహిరంగ సభలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ లకు సీఎం పదవి వారసత్వమేమో కానీ తనకు మాత్రం ఓ బాధ్యత అని పవన్ స్పష్టం చేశారు. 

Pawan kalyan comments on cm post
Author
Polavaram, First Published Oct 8, 2018, 6:29 PM IST

పోలవరం: ముఖ్యమంత్రి పదవి వారసత్వం కాదని ఒక బాధ్యత అని జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్రలో భాగంగా పర్యటిస్తున్న పవన్ కొయ్యల గూడెం బహిరంగ సభలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ లకు సీఎం పదవి వారసత్వమేమో కానీ తనకు మాత్రం ఓ బాధ్యత అని పవన్ స్పష్టం చేశారు. 

జనసేనకు భయపడే ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే జనసేన బలపడుతుందనే భయం అధికార పార్టీకి పట్టుకుందని విమర్శించారు. గ్రామాలకు నిస్వార్థంగా పనిచేసే సర్పంచ్ లు కావాలని పవన్ కోరారు. 

మరోవైపు పంచాయతీరాజ్‌ వ్యవస్థలో జనసేన పార్టీ జోక్యం చేసుకోబోదని తెలిపారు. అంతకుముందు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాజీ సర్పంచులతో పవన్ సమావేశమయ్యారు. 

గత ప్రభుత్వాలు పంచాయతీరాజ్‌ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ఇందిరమ్మ కమిటీ, జన్మభూమి కమిటీ, గ్రామ సచివాలయాల పేరుతో వారి పాలనలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచే కొత్తతరం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. 

 పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన పోరాడుతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులను ఎలా ఆదుకున్నారో అలానే పోలవరం బాధితులను కూడా ఆదుకోవాలని కోరారు. అలాగే పొగాకు రైతులకు రుణమాఫీ దక్కలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతలను ఆదుకుంటానని పవన్ హామీ ఇచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios