హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ని  కలిశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. అలాగే సోషల్ మీడియాలో తనపై వైరల్ అవుతున్న వీడియోలపైనా ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కల్గించేలా వీడియోలు క్రియేట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మరోవైపు తనపై ఏపీ సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేసినట్లు చెప్పుకొచ్చారు. తన సోదరుడి హత్య కేసులో క్లీన్ చిట్ ఇచ్చారని అయినా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.