టీడీపీ యువనేత, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ తనయుడి నామకరణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామ్ తన బిడ్డకు తన తండ్రి దివంగత నేత పరిటాల రవీంద్ర పేరే పెట్టుకున్నారు. 

వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తనయుడి పేరును శ్రీరామ్ ప్రకటించారు. తనయుడి పేరు ప్రకటించే సందర్భంలో శ్రీరామ్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉంటే.. పరిటాల శ్రీరామ్, జ్ఞాన దంపతులకు గతేడాది నవంబర్ 6న కుమారుడు పుట్టాడు. 

పరిటాల కుటుంబంలో మరో తరానికి వారసుడొచ్చాడంటూ రవి అభిమానులు, ఆయన అనుచరులు సంబరాలు జరుపుకున్నారు. అనంత రాజకీయాల్లో మరో తరం రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేశారు.