పరుచూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024  LIVE

Parchur assembly elections result 2024 : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పరుచూరు నియెజకవర్గానికి ప్రత్యేక స్థానం వుంది. టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ నియోజకవర్గానికి చెందినవారే. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి నుండి పోటీచేసి ఓటమిపాలైన వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే వైసిపి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది... టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును బరిలోకి దింపింది. దీంతో ఈ ఎన్నికల్లో పర్చూరులో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది. 

Parchur assembly elections result 2024 rsl

Parchur assembly elections result 2024 :

పరుచూరు రాజకీయాలు : 

పరుచూరు నియోజకవర్గం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేంది కారంచేడు ఘటన. ఇక్కడ దళితుల ఊచకోత ఘటన రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పింది. ఈ ఘటన ఎన్టీఆర్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చినా   టిడిపి దెబ్బతినలేదు. ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వరుసగా మూడుసార్లు ( 1983,1985,1989) టిడిపి నుండి గెలిచారు. మామ ఎన్టీఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గుబాటి  మళ్ళీ వరుసగా రెండుసార్లు (2004,2009) లో విజయం సాధించారు. కానీ 2019 లో మాత్రం టిడిపి చేతిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమిపాలయ్యారు. 

ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరుచూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాంబశివరావు చేతిలో స్వల్ప ఓట్ల (1,647) తేడాతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోయారు.  

పరుచూరు అసెంబ్లీ పరిధిలోని మండలాలు : 

1. కారంచేడు 
2. యద్దనపూడి 
3. పరుచూరు
4.ఇంకొల్లు 
5.చినగంజాం 
6. మార్టూరు 

పరుచూరు నియోజకవర్గ ఓటర్లు (2019 ఎన్నికల ప్రకారం) 

పరుచూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,30,219 

మహిళలు 1,17,452

పురుషులు 1,12,738

పరుచూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి : 

పరుచూరు నియోజకవర్గ ఇంచార్జీగా యడం బాలాజీని నియమించింది వైసిపి అదిష్టానం (మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను ఇంచార్జీ బాధ్యతల నుండి తప్పించింది)

టిడిపి అభ్యర్థి : 

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావునే మరోసారి పరుచూరు బరిలో నిలిపింది టిడిపి. 

పరుచూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

పరుచూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు 2,03,155 (88 శాతం)

టిడిపి - ఏలూరు సాంబశివరావు - 97,076 (47 శాతం) - 1,647 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - దగ్గుబాటి వెంకటేశ్వరరావు - 95,429 (46.97 శాతం) -ఓటమి 


పరుచూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు 1,89,033 (88 శాతం)

టిడిపి - ఏలూరు సాంబశివరావు - 97,248 (51 శాతం) - 10,775 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - గొట్టిపాటి భరత్ కుమార్ - 86,473 (45 శాతం) -ఓటమి 

  
  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios