P Gannavaram assembly elections result 2024: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గం పి. గన్నవరం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే 2024 ఎన్నికల్లోనూ వైసిపి, టిడిపిల మధ్య పోరు హోరాహోరీ సాగింది.  దీంతో పి. గన్నవరంలో ఎలక్షన్ రిజల్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

P Gannavaram assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాత గన్నవరం ఒకటి. ఈ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా ఎస్సీ ఓట్లు వుంటాయి. దీంతో బలమైన దళిత నేతలను ఈ నియోజకవర్గ బరిలో నిలిపాయి వైసిపి, టిడిపి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విప్పరి వేణుగోపాల్, కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ (జనసేన) పోటీ చేశారు. వీరి మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

 పి. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. పి. గన్నవరం 
2. అంబాజీపేట
3. అయినమిల్లి 
4. మామిడికుదురు ( కొన్ని గ్రామాలు)

పి. గన్నవరం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 1,95,237
పురుషులు - 96,683
మహిళలు ‌- 98,643

పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు మరోసారి పి.గన్నవరంలో పోటీచేసే అవకాశం వైసిపి ఇవ్వలేదు. అతడి స్థానంలో విప్పర్తి వేణుగోపాల్ ను వైసిపి అభ్యర్థిగా ప్రకటించారు.

టిడిపి అభ్యర్థి :

పి. గన్నవరం బరిలో మహాసేన రాజేష్ ను బరిలో దించాలని భావించినా చివరి క్షణంలో కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ (జనసేన) ను పోరులో దింపింది కూటమి.

పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,56,212 (82 శాతం)

వైసిపి - కొండేటి చిట్టిబాబు - 67,373 (43 శాతం) - 22,207 ఓట్ల మెజారిటీతో విజయం

టిడిపి -నేలపూడి స్టాలిన్ బాబు - 45,166 (28 శాతం) - ఓటమి 

పి. గన్నవరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,42,815 (78 శాతం)

టిడిపి - పులపర్తి నారాయణ మూర్తి - 4,967 (52 శాతం) - 13,505 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - కొండేటి చిట్టిబాబు - 61,462 (43 శాతం) - ఓటమి