జనసేన పార్టీ ప్రత్యర్థి పార్టీలు కక్ష కట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల గుంటూరులో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరోసారి అలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

గుంటూరు నగరంలోని జనసేన పార్టీ ఫ్లెక్సీలు, ప్రచార రథాలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. జనసేన అధినేత పవన్ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఆ పార్టీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ ఫ్లెక్సీలను కూడా ముక్కలుముక్కలుగా చించివేశారు. రెండు రోజుల క్రితం కూడా పార్టీ ప్రచార రథాలపై రాళ్ల దాడి జరిగింది.

కాగా.. ఈ వరస దాడులపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయంగా తమను ఎదుర్కొనే సత్తాలేని వాళ్లే ఈ పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పిరికిపంద చరర్యలు మానుకోవాలని సూచించారు