టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అధికారులు మరోసారి షాకిచ్చారు. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన పలు వాహనాలను సీజ్ చేశారు. ఈ ట్రావెల్స్ ఆధీనంలో ఉన్న బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు నిర్థారణ కావడంతో వాటిని సీజ్ చేశారు.

వీటిని నాగాలాండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు గుర్తించారు. కాగా గతంలో కూడా వెహికల్స్‌ని అధికారులు సీజ్ చేశారు. తాజాగా ఇవాళ మరో నాలుగు టిప్పర్లను సీజ్ చేశారు.

అంతేకాకుండా ఇంకా మొత్తం 154 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో త్వరలో వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు  పేర్కొన్నారు. కాగా దీనిపై టీడీపీ సీనియర్ నేత లీడర్ జేసీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి