విశాఖలో దారుణం జరిగింది. గాజువాక ఆటోనగర్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్ పేలిపోయింది. ట్యాంకర్‌కు వెల్డింగ్ పనులు చేస్తుండగా.. భారీ శబ్ధంతో అది పేలిపోయింది. ఈ ఘటనలో నాగేశ్వరరావు అనే కార్మికుడు మరణించగా..  మరో హెల్పర్ తీవ్ర గాయాల పాలవ్వడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు.

మృతుడు నాగేశ్వరరావు ఆటోనగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. వెల్డింగ్ పనిపై అవగాహన వుండటంతో అప్పుడప్పుడు ఆ పనికి కూడా వెళ్లేవాడు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయిల్ ట్యాంకర్ పై భాగంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా ట్యాంకర్ పేలిపోయింది. పేలుడు ధాటికి అతను దూరంగా ఎగిరిపడ్డాడు. అతని శరీరం తునాతునకలు అయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.