ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. 

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఉమా మహేశ్వరి ఎన్టీఆర్‌కు నాలుగో కుమార్తె. ఆమె హఠాన్మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.