ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి నూతన స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంటక అప్పలనాయుడు ప్రకటించారు.

స్పీకర్‌గా ఇప్పటికే తమ్మినేని సీతారాం పేరును వైఎస్ జగన్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన నామినేషన్ సైతం దాఖలు చేశారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్ధతు పలికారు.

స్పీకర్‌గా తమ్మినేని ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నేపథ్యంలో గురువారం తమ్మినేని స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.