Asianet News TeluguAsianet News Telugu

:కాకినాడ మేయర్ పావనిపై నెగ్గిన అవిశ్వాసం: పంతం నెగ్గించుకొన్న టీడీపీ అసమ్మతి కార్పోరేటర్లు

కాకినాడ మేయర్ పదవిని సుంకర పావని కోల్పోయారు. రెబెల్ కార్పోరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా 36 మంది కార్పోరేటర్లు ఓటు చేశారు. పావనికి అనుకూలంగా ఎవరూ కూడ ఓటు చేయలేదు. పార్టీ విప్ జారీ చేసినా కూడ టీడీపీలోకి రెబెల్ కార్పోరేటర్లు పావనికి వ్యతిరేకంగా ఓటు చేశారు.

No trust motion against Kakinada mayor: pavani lost her mayor post
Author
Kakinada, First Published Oct 5, 2021, 12:05 PM IST

కాకినాడ: కాకినాడ మేయర్ పై  (kakinada mayor)టీడీపీలోని (tdp)అసమ్మతి వర్గానికి చెందిన టీడీపీ కార్పోరేటర్లు (rebel corporators)ప్రతిపాదించిన అవిశ్వాసం నెగ్గింది(no trust motion).  అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 మంది ఓటు చేశారు. అవిశ్వాసానికి ఎవరూ కూడ వ్యతిరేకంగా ఓటు చేయలేదు.దీంతో మేయర్ పదవిని సుంకర పావని (sunkara pavani)కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అవిశ్వాస తీర్మాన ఫలితాన్ని రిజర్వ్ లో ఉంచినట్టుగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యంలో అవిశ్వాస తీర్మాణ ఫలితాన్ని రిజర్వ్ లో ఉంచామన్నారు. 

 

 

 

also read:కాకినాడ మేయర్‌పై అవిశ్వాసం: నేడు ప్రత్యేక సమావేశం, అందరి చూపు వారిపైనే

2017లో కాకినాడ కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగాయి. 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. కార్పోరేటర్లలో ఒకరు రాజీనామా చేశారు. ముగ్గురు మరణించారు. దీంతో ప్రస్తుతం  44 మంది కార్పోరేటర్లున్నారు. కాకినాడ కార్పోరేషన్ లో టీడీపీకి 30 మంది కార్పోరేటర్లున్నారు.

వైసీపీకి 8 మంది సభ్యులున్నారు. బీజేపీకి ముగ్గురు కార్పోరేటర్లున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులున్నారు. అయితే ఇండిపెండెంట్ సభ్యుల్లో ఒకరు గతంలోనే టీడీపీకి మద్దతిచ్చారు.

టీడీపీకి ఉన్న 30 మంది కార్పోరేటర్లలో 21 మంది అసమ్మతి గళం విన్పిస్తున్నారు.  అయితే టీడీపీ నాయకత్వం విప్ జారీ చేసింది. మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ కు అనుకూలంగా ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. విప్ జారీ చేసిన పత్రాలను టీడీపీ నేతలు జాయింట్ కలెక్టర్ కు సోమవారం నాడుఅందించారు.

కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ పై అసమ్మతికి సంబంధించి ఇవాళ ప్రత్యేకంగా కార్పోరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.పార్టీ విప్ ను ధిక్కరించి ఓటు చేసే కార్పోరేటర్లపై టీడీపీ నాయకత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. అయితే కాకినాడ మేయర్ పై అసమ్మతి వర్గానికి చెందిన కార్పోరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో మేయర్ పదవి నుండి పావని తప్పుకోవాల్సి న అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. అవిశ్వాస తీర్మాణంలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమమెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓటింగ్ లో పాల్గొన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios