అమరావతి: రాష్ట్రంలో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ ఆనవాళ్లు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు.

సోమవారంనాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  యూకే నుండి రాష్ట్రానికి ఇప్పటివరకు 1369 మంది వచ్చారని ఆయన తెలిపారు.  వీరిలో 1346 మందిని క్వారంటైన్ కు పంపామన్నారు.

యూకే నుండి వచ్చిన వారిలో ఇంకా 17 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.  యూకే నుండి వచ్చినవారిలో 11 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు.

యూకే  నుండి వచ్చినవారికి సంబంధించిన కాంటాక్టుల్లో 12 మందికి కూడ కరోనా సోకిందని తెలిపారు.  దీనికి సంబంధించి పుణె వైరాలజీ ల్యాబ్ సీసీఎంబీ నుండి ఇంకా నివేదికలు రావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్  ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. దీంతో కేంద్రం నుండి జాగ్రత్తలు తీసుకొంది. బ్రిటన్ నుండి వచ్చిన వారిని పరీక్షిస్తున్నారు. అంతేకాదు బ్రిటన్ నుండి వచ్చినవారిని క్వారంటైన్ లో ఉంచుతున్నారు.