హైదరాబాద్: బీజేపీలో చేరే విషయమై మెగాస్టార్ చిరంజీవి స్పష్టత ఇచ్చారు. కొంత కాలంగా చిరంజీవి పార్టీ మారుతారని ప్రచారం సాగుతున్న తరుణంలో  ఈ ప్రచారానికి  చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

ఓ తెలుగు దినపత్రికకు మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాలతో పాటు రాజకీయ అంశాలపై కూడ చిరంజీవి స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీలో చేరుతున్నట్టుగా సాగుతున్న ప్రచారాన్ని చిరంజీవి కొట్టి పారేశారు. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను చిరంజీవి ఖండించారు.

సైరా సినిమా అక్టోబర్ రెండో తేదీన విడుల కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఇప్పుడు సినిమా పార్టీలో ఉన్నానని చిరంజీవి చెప్పారు. సైరా సినిమా నిర్మాణం పూర్తి కావడంతో తాను చాలా రిలాక్స్‌డ్ గా ఉన్నట్టుగా చిరంజీవి చెప్పారు. బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని  ఆయన కుండబద్దలు కొట్టారు.