అడిగిన వెంటనే డీజీల్ పోయలేదనే నెపంతో  పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తిపై గుంటూరు జిల్లా నిజాంపట్నం ఎస్సై రాంబాబు దాడికి దిగారు. ఈ దాడిని నిరసిస్తూ  బంక్ కార్మికులు పోలీ‌స్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.ఇదిలా ఉంటే  ఈ ఆరోపణల్లో నిజం లేదని ఎస్ఐ చెబుతున్నాడు.

గుంటూరు:అడిగిన వెంటనే డీజీల్ పోయలేదనే నెపంతో పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తిపై గుంటూరు జిల్లా నిజాంపట్నం ఎస్సై రాంబాబు దాడికి దిగారు. ఈ దాడిని నిరసిస్తూ బంక్ కార్మికులు పోలీ‌స్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.ఇదిలా ఉంటే ఈ ఆరోపణల్లో నిజం లేదని ఎస్ఐ చెబుతున్నాడు.

గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని ఓ పెట్రోల్‌ బంకుకు స్థానిక ఎస్ఐ పెట్రోల్ కోసం తన వాహనాన్ని పంపాడు. అయితే డీజీలో పోయాలని తమ యజమాని చెబితేనే డీజీల్ పోస్తానని బంకులో పనిచేసే వ్యక్తి చెప్పాడు. దీంతో అదే వాహనాన్ని వెనక్కి పిలిపించుకొని ఎస్ఐ బంకుకు వచ్చి ఆ కార్మికుడిపై దాడికి దిగారు. స్టేషన్‌కు తీసుకెళ్లి కార్మికుడిపై దాడికి దిగారు.

నెల నెల బిల్లు చెల్లిస్తామని డీజీల్ కోసం వాహనం పంపితే డీజీల్ పోయలేదన్నారు. అంతేకాదు డీజీల్ పోయకుండా కార్మికుడు దురుసుగా మాట్లాడారని ఎస్ఐ చెప్పారు. కార్మికుడిపై తాము దాడికి పాల్పడలేదని ఎస్ఐ చెప్పారు.