తాడేపల్లిగూడెం నిట్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం:కిరణ్ అనే విద్యార్ధిపై సీనియర్ల దాడి

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకొంది. సెకండియర్ విద్యార్ధిపై సీనియర్లు దాడికి పాల్పడ్డారు.

NIT Tadepalligudem students booked for ragging

తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా Tadepalligudem NIT కాలేజీలో  ర్యాగింగ్ చోటు చేసుకొంది.,  సెకండియర్ విద్యార్ధి జయ కిరణ్ పై సీనియర్లు Ragging పేరుతో దాడికి పాల్పడ్డారు., ఈ విషయమై  కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు  ఆధారంగా పోలీసులు సీనియర్లను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తాడేపల్లిగూడెం నిట్ క్యాంపస్‌లో దారుణం చోటు చేసుకుంది. సెకండ్ ఇయర్ మెకానికల్ చదువుతున్న యడ్లపల్లి Jaya kiran ను థర్డ్, ఫోర్త్ ఇయర్ చదువుతోన్న విద్యార్థులు విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనపై పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తనను మూడు నెలలుగా  కొందరు సీనియర్లు ర్యాగింగ్‌ చేస్తున్నారని కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 క్యాంపస్‌లో పలు సందర్బాల్లో జయకిరణ్ ను కామెంట్స్ చేయడం, తిట్టడంతో జయకిరణ్ కు  అన్ నోన్ నంబర్ నుంచి వారికి మెసేజ్‌లు పంపించారు. పథకం ప్రకారం జయకిరణ్‌ను సీనియర్లు రూమ్‌కు పిలిపించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి కేబుల్ వైర్ , మగ్గులు, సెల్ ఫోన్లతో విచక్షణా రహితంగా కొట్టారు. రాత్రి 11 నుంచి తెల్లవారే వరకు దాడిచేయటంతో జయకిరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అయితే దాడిసమయంలో ఫోటోలు ,వీడియో లు తీసిన సీనియర్ విద్యార్థులు వాటిని క్యాంపస్ లో  సర్క్యు‌లేట్ చేశారు. 

దీంతో ఈ విషయం  బయటకు వచ్చింది. ఈ ఘటనపై ర్యాగింగ్ యాక్ట్ తో పాటు దాడి, అక్రమనిర్బంధం వంటి సెక్షన్లపై కేసు నమోదు చేశారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకొన్నాయి. రెండు రాష్ట్రాలు కూడ ర్యాగింగ్ పై నిషేధం విధించాయి. ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొంటున్నాయి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios