Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కంటి ఇన్ ఫెక్షన్: కడప జిల్లా పర్యటన వాయిదా

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన కడప జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. కంటి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నందున ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

Nimmagadda Ramesh Kumar suffers from eye infection
Author
Amaravathi, First Published Feb 8, 2021, 10:27 AM IST

అమరావతి: ఆంధ్రప్రేదస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. దీంతో ఆయన కడప జిల్లా పర్యటన వాయిదా పడింది. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ రేపు మంగళవారం జరుగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాడి గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

ఎన్నికల అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి గృహనిర్బంధం విధిస్తూ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మీడియాతో కూడా మాట్లాడవద్దని ఆయన ఆదేశించారు. అయితే, రామచంద్రారెడ్డి గృహనిర్బంధం ఆంక్షలను హైకోర్టు ఎత్తేసింది. అయితే, మీడియాతో మాత్రం మాట్లాడవద్దని తేల్చి చెప్పింది. 

కాగా, తనపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పిచ్చి మనిషి, మ్యాడ్ ఫెల్లో అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మీడియాతో కూడా మాట్లాడనీయవద్దని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేసిన కొద్ది సేపటికే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. 

టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మురికి కూపంలో కలిసిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు దయ తలిచి ఇచ్చిన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని, చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఆయన నిమ్మగడ్డపై ఆరోపణలు చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న తన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయని, అటువంటి స్థితిలో తనతో మాట్లాడుకుండా ఏకపక్షంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు 

తనపై ఆంక్షలు విధిస్తూ అలాంటి ఆదేశాలు ఇవ్వవచ్చునా, లేదా అని గానీ ఇలా ఇస్తే అవి అమలవుతాయా,లేదా అని కూడా చూడకుండా ఇంగిత జ్ఢానం లేకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదో ఊహించుకుంటున్నారని, ఆయన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి మాత్రమేనని పెద్దిరెడ్డి అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ విధమైన ఆదేశాలు జారీ చేస్తారని ముందుగానే ఊహించినట్లు ఆయన తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సర్టిఫికెట్ తనకు అవసరం లేదని ఆయన అన్నారు. ప్రజలు తనను ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. 

తనపై నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా తన మనుషులు ఎవరు కూడా ఆందోళన చేయబోరని, ఆ అవసరం లేదని ఆయన చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. 


పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికి మాత్రమే పరిమితం చేయాలని, ఆయన బయటకు రాకుండా చూడాలని నిమ్మగడ్డ డిజిపీకి ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. డీజీపీకి, ఎస్పీకి ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నెల 21వ తేదీ వరకు పెద్దిరెడ్డిపై ఆంక్షలను అమలు చేయాలని ఆయన చెప్పారు. మీడియాతో కూడా మాట్లాడేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనుమతించకూడదని ఆయన అన్నారు. ఎన్నికలు నిర్భయంగా జరిపించడానికే ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయడంపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని, ఏకగ్రీవాలను ప్రకటించకపోతే ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను అమలు చేయకూడదని ఆయన రిటర్నింగ్ అధికారులకు సూచించారు  నిమ్మగడ్డ ఆదేశాలను పాటించే అధికారులను బ్లాక్ లిస్టులో పెడుతామని ఆయన హెచ్చరించారు. 

దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రంగా ప్రతిస్పందించారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడిన విషయాలు ప్రచురితమైన పత్రికల కట్టింగ్స్ ను కూడా నిమ్మగడ్డ తన లేఖకు జత చేశారు. ఎన్నికలు సజావుగా జరగడానికే పెద్దిరెడ్డిపై ఆంక్షలు పెడుతున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios