నిడదవోలు-నర్సాపురం  ప్యాసింజర్ రైలులో బుధవారంనాడు మంటలు చెలరేగాయి.

ఏలూరు: నిడదవోలు-నర్సాపూర్  ప్యాసింజర్ రైలులో బుధవారంనాడు మంటలు చెలరేగాయి. దీంతో  ప్రయాణీకులు భయంతో  రైలు నుండి బయటకు  వచ్చారు.  రైలులో  మంటల కారణంగా  ఉండ్రాజవరం  మండలం సత్యవేడులో రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది రైలులో మంటలను ఆర్పివేశారు.  షార్ట్ సర్క్యూట్  కారణంగా  రైలులో మంటలు వచ్చినట్టుగా   అధికారులు  ప్రాథమికంగా  అంచనా వేస్తున్నారు.