మావోయిస్ట్ ఆర్కే భార్య శిరీషను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి తరలించారు. 

nia officials arrests maoist leader rk wife seerisha ksp

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని స్వగృహం నుంచి శిరీషను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఆమెను అక్కడి నుంచి తరలించారు. ఈ మేరకు తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది. 

ALso Read: ఏపీలో ఎన్ఐఏ సోదాలు ... దివంగత మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే భార్య ఇంట్లో తనిఖీ

ఇటీవల శిరీష ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలపై శిరీష స్పందిస్తూ భర్త, కుమారున్ని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వుండగా ఇలా విచారణ, సోదాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం విజయవాడకు వెళ్లానని... తాను ఇంట్లో లేని సమయంల ఎన్ఐఏ సోదాలు చేపట్టిందని అన్నారు. మావోయిస్టులకు నగదు పంపించినట్లు ఎన్ఐఏ అధికారులకు చేపుతున్నదాంట్లో నిజం లేదని శిరీష అప్పట్లో పేర్కొన్నారు. 
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios