విజయవాడ భవానీ కేసులో ట్విస్ట్: పెంపుడు తల్లి ఫిర్యాదు, డీఎన్ఏ టెస్ట్‌కు ఏర్పాట్లు

విజయవాడ భవానీ కేసు మలుపు తిరిగింది. ఆ బాలికకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. మైనర్ కావడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. 

news twist in vijayawada bhavani case

విజయవాడ భవానీ కేసు మలుపు తిరిగింది. ఆ బాలికకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. మైనర్ కావడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.

విజయవాడలో భవానీని పెంచిన తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని నగర పోలీసు కమీషనర్ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. ఈ నెల 8న ఆమెను కన్న తల్లిదండ్రులకు అప్పగించేందుకు పెంచిన తల్లిదండ్రులు అంగీకరించారు.

Also Read:బెజవాడ భవానీ కథ సుఖాంతం: కూతురిని కన్నవారి చెంతకు చేర్చిన ఫేస్‌బుక్

తాను కన్న తల్లిదండ్రుల వద్దే ఉంటానని భవానీ తేల్చి చెప్పడంతో ఆమె నిర్ణయం మేరకు పోలీసుల సమక్షంలో కన్న తల్లిదండ్రులకు భవానీని అప్పగించారు. దీంతో 14 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు చేరింది భవానీ.

తాను పదిరోజులు పెంచినవారి వద్ద.. పది రోజులు కన్నవారి వద్ద ఉంటానని భవానీ మీడియాకు తెలిపింది. తనకు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశ్యం లేదని ఇద్దరూ తనకు తల్లిదండ్రులేనని చెప్పింది. పోలీసులు సైతం డీఎన్ఏ టెస్ట్ ఏం అవసరం లేదని పోలికలు కనిపిస్తున్నాయని వారు చెప్పినట్లు ఆమె వెల్లడించింది.

ఈ సందర్భంగా భవానీ కన్న తల్లిదండ్రులు మాట్లాడుతూ.. 12 ఏళ్ల తర్వాత మా పాప భవానీ కనిపించడం సంతోషంగా ఉందన్నారు. మా పాపను తమకు అప్పగించాలని పోలీసులను కోరామని, తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని ఆమె స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లికి చెందిన భవానీ దాదాపు 14 ఏళ్ల కిందట సోదరుడి వెంట స్కూలుకు వెళ్లి తప్పిపోయింది. దీంతో ఆమె కోసం తల్లిదండ్రులు ఎన్నో ఏళ్లుగా వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో వారు కూతురిపై ఆశలు వదులుకున్నారు.

Also Read:అత్యాచారానికి పాల్పడితే మరణిశిక్షే...ఏపి కేబినెట్ సంచలన నిర్ణయం

అయితే భవానీ గురించి తెలుసుకున్న విజయవాడ పటమటలంకకు చెందిన మోహన్ వంశీ అనే వ్యక్తి యువతిని ఆమె కుటుంబసభ్యులకు పరిచయం చేశాడు. తన ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన భవానీ గతం గురించి తెలుసుకున్న ఆయన.. ఆమె చెప్పిన ఆధారాలతో సంబంధిత వ్యక్తుల కోసం ఫేస్‌బుక్‌లో వెతికాడు.

అలా భవానీ తల్లిదండ్రుల జాడ గుర్తించి అందరినీ కలిపాడు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే జరిగినా.. భవానిని 14 ఏళ్ల పాటు పెంచిన జయమ్మ ఈ విషయం జీర్ణించుకోలేకపోయింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios